Header Banner

వైసీపీ వాళ్లుకు టీడీపీ నేత బంపర్ ఆఫర్.. ఆయన ఆచూకీ చెప్పండి.. బహుమతి పొందండి!

  Fri Apr 18, 2025 22:00        Politics

క్వార్ట్జ్ అక్రమ మైనింగ్, అక్రమ రావాణా కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. నెల రోజులుగా ఆయన ఆచూకీ తెలియడం లేదు. ఆయన కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఇలా పలు ప్రాంతాల్లో పోలీసులు గాలిస్తున్నారు. ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లపై కూడా నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బంపర్ ఆఫర్ ప్రకటించారు. కాకాణి గోవర్ధనన్ ఎక్కడున్నారో తెలియడం లేదని... కాకాణి ఆచూకీ చెప్పిన వారికి బహుమతి ఇస్తానని సోమిరెడ్డి చెప్పారు. వైసీపీ వాళ్లు అయినా సరే ఆయన ఆచూకీ చెపితే వారికి కాకాణి ఇంటి పక్కన ఉన్న కరోనా హౌస్ ను బహుమతిగా ఇద్దామని అనుకుంటున్నానని చెప్పారు. పోలీసుల చొక్కాలు విప్పుతానని కాకాణి అన్నాడని, సవాళ్లు విసిరాడని, తొడలు కొట్టాడని... ఇప్పుడు ఎక్కడున్నాడని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. పిరికిపందలా దాక్కున్నాడని అన్నారు. కాకాణి దర్శనమిస్తే చూడాలని ఉందని... మంత్రులుగా పని చేసిన వాళ్లు పిరికివాళ్ల మాదిరి ఇలా పారిపోతారని అనుకోలేదని దెప్పిపొడిచారు. వల్లభనేని వంశీ కూడా పెద్ద తప్పు చేశాడని... జగన్ కు ఏ మాత్రం మానవత్వం ఉన్నా వల్లభనేని వంశీ తప్పుగా మాట్లాడినప్పుడే చర్యలు తీసుకోవాల్సిందని అన్నారు.  

 

ఇది కూడా చదవండి: జగన్ గుండెల్లో గుబులు.. వలసబాటలో వైఎస్సార్సీపీ మాజీ మంత్రి రోజా! పార్టీలోకి అడుగు..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బీజేపీ నుంచి టీడీపీకి గవర్నర్ ఆఫర్.. చంద్రబాబు ఎంపికపై ఉత్కంఠ! ఆ ఇద్దరి పేర్లు లిస్ట్ లో..!

 

అమరావతిలో అభివృద్ధికి శ్రీకారం.. మోదీ పర్యటనకి గ్రాండ్ వెల్‌కమ్! రైతులు పూలతో ప్రత్యేక స్వాగతం!

        

ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధం! 57 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం.. 6 సమాంతర రన్వేలు!

 

మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్! డాక్టరేట్ పెద్ద దుమారమే.. నెట్టింట చర్చ!

 

బ్రేకింగ్ న్యూస్! సిట్ విచారణకు సాయిరెడ్డి! వెలుగులోకి వస్తున్న కీలక సమాచారం!

 

వైసీపీకి ఊహించని షాక్! పాలేటి కృష్ణవేణికి 14 రోజుల రిమాండ్!

 

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని దుర్మరణం! మృతదేహ రవాణకు కేంద్ర మంత్రి కృషి!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్! ఆ జిల్లాలో ఎయిర్ పోర్ట్ నిర్మాణ సన్నాహాలు!

 

నేడు (18/4) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Somireddy #TDP #YCPleaders #AttackOnsomireddy #NelloreDistrict #AndhraPradesh #APNews #APPolitics #TDPNews